tubetranscript.io

Naveen Tips and Tricks · Transcript · · Updated

🔥 రామప్ప దేవాలయం రహస్యాలు! 😱 శిల్పి పేరుతో ఆలయం ఎందుకు? | UNESCO Heritage | Telugu – Transcript

Video by Naveen Tips and Tricks · Watch the original on YouTube

Summary

AI-generated from the transcript. Verify details against the source video.

  • ప్రపంచంలో దేవుని పేరుతో కాకుండా ఒక శిల్పి పేరుతో పిలవబడే ఏకైక దేవాలయం రామప్ప దేవాలయం.
  • ఈ ఆలయ నిర్మాణానికి ఫ్లోటింగ్ బ్రిక్స్ టెక్నాలజీ మరియు సాండ్ బాక్స్ టెక్నాలజీలను ఉపయోగించారు.
  • 2021 జూలై 25న యునెస్కో రామప్ప ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో చేర్చింది.
Video thumbnail: 🔥 రామప్ప దేవాలయం రహస్యాలు! 😱 శిల్పి పేరుతో ఆలయం ఎందుకు? | UNESCO Heritage | Telugu
Source video on YouTube · Transcript generated automatically and may contain errors.

Use this video with Pro

Reading, copying and transcript downloads are free. Create saved AI results for this video with a signed-in Pro account ($9/month).

Transcript

Search ignores accents. All transcript text stays visible.

నీటిపై వేస్తే తేలియాడే ఇటుకలు 800 ఏళ్ల క్రితమే భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించిన శాండ్ బాస్ టెక్నాలజీతో నిర్మించిన ఇటుకలు ప్రపంచంలో దేవుని పేరుతో కాకుండా ఒక శిల్పి పేరుతో పిలవబడే ఏకైక దేవాలయం తెలంగాణ గర్వం మన భారతదేశపు 39వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన రామప్ప దేవాలయం గురించి ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు ఇది 800 ఏళ్ల క్రితం కాకతీయుల ఇంజనీరింగ్ నైపుణ్యానికి శిల్పకలకు నిలువెత్తు

సాక్ష్యం. ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోలో మీకు ఆలయం ఎక్కడ ఉంది ఎవరు కట్టించారు ఎప్పుడు కట్టించారు దీని ఆర్కిటెక్చర్ మరియు ఇంజనీరింగ్ విశేషాలు ఏంటి? మదనికలు అనే శిల్పాలు అంటే ఏంటి? వాటి ప్రత్యేకతలు ఏంటి? పేరని శివతాండం శిల్పాల గురించి అదేవిధంగా యునెస్కో హెరిటేజ్ అనేది ఎందుకు రావడం జరిగింది? మన ఎగ్జామ్స్ కి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ఇది ఎందుకు అంత ప్రాముఖ్యతగా నిలిచింది? ఈ రామప్ప దేవాలయం అనేది ప్రతి ఒక్కటి ఈ [గురకలు] వీడియోలో

మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ దిస్ ఇస్ నవీన్ గుడూరి ఈ వీడియోలో మనం మొదటగా రామప్ప ఆలయంకి సంబంధించిన చరిత్ర తెలుసుకుందాం. ఈ ఆలయం అసలు పేరు కాకతీయ రుద్రేశ్వరా ఆలయం కానీ ప్రజల్లో పర్యటకుల్లో ఇది రామప్ప ఆలయం అనే పేరుతోనే ప్రసిద్ధిగా ఉంది. ప్రపంచంలో దేవుని పేరుతో కాకుండా ఒక శిల్పి పేరుతో ఉన్న ఏకైక ఆలయం రామప్ప ఆలయం. ఇది తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట్ అనే

గ్రామంలో ఉంది. ఈ ఆలయం నిర్మాణానికి సుమారు 40 సంవత్సరాలు పట్టింది. మరి ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు? ఈ ఆలయాన్ని కాకతీయ రాజు అయిన గణపతి దేవుడు కాలంలోని తన సేనాధిపతి అయిన ప్రేచర్ల రుద్రుడు నిర్మించడం జరిగింది. దాదాపు 40 సంవత్సరాలు కష్టపడి ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులోని ఇంజనీరింగ్ విశేషాలకు సంబంధించి మాట్లాడదాం. ఇక్కడే రామప్ప ఆలయం నిజంగా ప్రత్యేకమవుతుంది.

మొదటిది ఫ్లోటింగ్ బ్రిక్స్ టెక్నాలజీ ఇంతకుముందు చెప్పిన మాదిరిగా ఈ గుడి గోపురం పై భాగంలో వాడిన ఇటుకలు అనేవి చాలా తేలికైనవి రంద్రాలతో కలిగి ఉన్నవి పోరస్ వంటివి. దీనివల్ల పైకప్పు బరువు తగ్గి భూకంపం వచ్చినప్పుడు ఆలయం కంపించకుండా కూలిపోకుండా కాపాడుతుంది. రెండవది ఈ నిర్మాణానికి ఉపయోగించిన టెక్నాలజీ సాండ్ బాక్స్ టెక్నాలజీ. ఆలయ నిర్మాణంలో ఇసుకపొర వాడి భూకంప శక్తిని శోషించి కొనేల చేసి ఈ

డిజైన్ అనేది చేయడం జరిగింది. అంటే భూకంపం వచ్చినప్పుడు కూడా ఈ ఇసుకపోర ఒక శాకబ్ జార్ లాగా వాడి ఆలయాన్ని రక్షించడం జరుగుతుంది. ఇది ప్రాచీన భారతీయ సిస్మిక్ రెసిస్టెంట్ ఇంజనీర్ కి అద్భుతమైన ఉదాహరణ.

800 ఏళ్ల క్రితమే నేటి భూకంప ఇంజనీర్ సూత్రాలను వాడారంటే అది మన కాకతీయుల మేదస్సుకే నిదర్శనం. మూడోది స్తంభాలు మరియు బీమ్స్ డిజైన్ సంబంధించి ఇవి గ్రానైట్ మరియు డోలరేట్ తో చేసిన స్తంభాలు బీమ్స్ పైన సూక్ష్మ శిల్పాలు ఉన్నాయి. ఇది కేవలం అందం కోసం కాదు నిర్మాణ పరంగా కూడా బలంగా ఉండేలా డిజైన్ చేయడం జరిగింది.

నాలుగోది వచ్చేసి శాసనం 204 పంక్తుల శాసనం నిర్మాణ వివరాలు, దాతలు, కాలం గురించి మనకు స్పష్టమైన ఆధారాన్ని ఇస్తాయి ఈ శాసనాలని ఇది చరిత్రకారులకు ఆర్కియాలజిస్టులకు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. మొత్తం మీద రామప్ప ఆలయం కేవలం భక్తిస్థలం మాత్రమే కాదు ఇది ఒక ఇంజనీరింగ్ ల్యాబ్ ఒక ఆర్కిటెక్చర్ మ్యూజియం ఒక చరిత్ర పుస్తకం నెక్స్ట్ మనం రామప్ప ఆలయంలోని అత్యంత ప్రత్యేకమైన

శిల్పాల గురించి మాట్లాడుకుందాం వీటినే మదనికలు అని అంటారు. శిలబాలికలు అని కూడా పిలుస్తారు. అసలు మదనికలు అంటే ఏంటి? మదనిక అంటే సంస్కృతంలో సుందరి లేదా నృత్య కళాకారిని అని అర్థం. రామప్ప ఆలయంలో ప్రధాన గర్భగుడి ముందు మండపంలో నృత్య భంగిమలలో ఉన్న శిలా బాలికలనే మధనికలు అని అంటారు. ఇవి కేవలం రాతి శిల్పాలు కాదు ఇవి నిజంగా ప్రాణం పోసి మలిచినట్టే ఉంటాయి.

ప్రతి బంగిమ ప్రతి కదలిక ప్రతి ఆలయం సూక్ష్మంగా చెక్కబడి ఉంటుంది. మదనికల ప్రత్యేకలు చూస్తే ప్రతి మదనిక వేరువేరు నుత్య భంగిమల్లో ఉంటుంది. కొందరు చేతులు పైకెత్తి నాట్యం చేస్తున్నట్టు కొందరు సంగీత వాయిద్యాలు వాయిస్తున్నట్టు కొందరు పూజ చేస్తున్నట్లు ఈ శిల్పాలు అనేది చెక్కడం జరిగింది. వీటిలో అలంకారాల విషయాలకు వస్తే ఈ మదనికలు గజ్జలు, గాజులు, హారాలు, కమ్మలు, ఒడ్డానాలు వంటి ఆభరణాలు

సూక్ష్మంగా చెక్కబడి ఉన్నాయి. ఇవి చూస్తే నిజంగా అవి ధరిస్తున్నట్టే అనిపిస్తాయి. ప్రతి మదనిక ముఖంలో వేరు వేరు భావాలు కనిపిస్తాయి. కొందరి ముఖంలో ఆనందం మరికొందరి ముఖంలో భక్తి మరికొందరి ముఖంలో లయ కనిపిస్తుంది. ఈ మదనికల్లు కాకతీయ శిల్పుల నైపుణ్యానికి కళాత్మక దృష్టికి అద్భుతమైన ఉదాహరణ. 800 ఏళ్ల క్రితమే ఇంత సూక్ష్మంగా శిల్పాలు మల్చగలిగారంటే అది వారి మేదస్సుకే నిదర్శనం.

ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనక ఎప్పుడైనా ఈ ఆలయంకి సంబంధించి ప్రశ్న వచ్చినప్పుడు మదనికలు నృత్య శిల్పాలు శిలబాలికలు వంటి పదాలు తప్పకుండా ప్రస్తావించాలి. ఇవి రామప్ప ఆలయానికి ప్రత్యేకతను తెచ్చిన అంశాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇప్పుడు మనం రామప్ప ఆలయంలోని మరొక అద్భుతమైన శిల్పం గురించి మాట్లాడుకుందాం. దాని పేరే పేరని శివతాండవం. పేరని శివతాండవం అంటే ఏంటి?

మన కాకతీయ సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు చేసే నృత్యాన్నే పేరనిశ్వతాండవం అని అంటారు. ఇది ఒక ప్రాచీనమైన నృత్యశైలి రామప్ప ఆలయంలో శివుని తాండవ నృత్య భంగిమలో ఈ శిల్పం కూడా ఉంది. కాకతీయ సైనిక సంస్కృతికి ఇది నిదర్శనంగా చెప్తారు.

పేరని నృత్యం కాకతీయ సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు చేసే నృత్యం. ఇది వీరత్వానికి ధైర్యానికి శక్తికి ప్రతీక. ఈ నృత్యం చేసి సైనికులు తమలో ధైర్యాన్ని ఉత్సాహాన్ని నింపుకొని యుద్ధాలకు వెళ్ళేవారు. అంతరించిపోతున్న ఈ కలను నటరాజ రామకృష్ణ మళ్ళీ పునరుద్ధరించి వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ ఆలయానికి యునెస్కో హోదా ఎందుకు రావడం జరిగింది వాటికి సంబంధించిన విశేషాలు చూద్దాం. 25

జూలై 2021న యునెస్కో రామప్ప ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో చేర్చింది. ఇది భారతదేశపు 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్. తెలంగాణ నుంచి మొదటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఇదే. యునెస్కో ఎందుకు ఈ ఆలయాన్ని ఎంపిక చేసిందంటే ఇది కాకతీయ సంస్కృతి శిల్పకలకు అసాధారణ సాక్ష్యం ఇంజనీరింగ్ మరియు ఆర్కిటెక్చర్ మరియు శిల్ప కలల్లో అద్వితీయ సాంకేతికలు ఉన్నాయి

కాబట్టి అదేవిధంగా ఫ్లోటింగ్ బ్రిక్స్ సాండ్ బాక్స్ టెక్నాలజీ సిస్మిక్ రెసిస్టెంట్ డిజైన్ వంటి ప్రత్యేకంగా ఈ ఆలయ నిర్మాణానికి వాడారు ఉపయోగించారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వీటికి సంబంధించి యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో మదనికలు పేరని శివతాండవం వంటి నృత్య శిల్పాలు కాకతీయ కళా సంస్కృతికి నిదర్శనాలు. నచ్చిందా వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్

ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్.

Frequently asked questions

రామప్ప ఆలయం అసలు పేరు కాకతీయ రుద్రేశ్వరా ఆలయం.

రామప్ప ఆలయంలో ప్రధాన గర్భగుడి ముందు మండపంలో నృత్య భంగిమలలో ఉన్న శిలా బాలికలనే మధనికలు అని అంటారు.

కాకతీయ సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు చేసే నృత్యాన్నే పేరనిశ్వతాండవం అని అంటారు.